వీళ్లు గాంధీలు కాదు.. జహంగీర్లు...

by Disha Web Desk 15 |
వీళ్లు గాంధీలు కాదు.. జహంగీర్లు...
X

దిశ, నిజామాబాద్ సిటీ : గాంధీ కుటుంబం అని గొప్పలు చెప్పుకునే రాహుల్ గాంధీ కుటుంబం గాంధీలు కారని వారు జహంగీర్ లు అని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ వారు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తమ స్వార్థం కోసం దేశాన్ని మూడు ముక్కలు చేయడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని అన్నారు. దేశానికి ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో సెక్యూలర్ పదాన్ని ఎందుకు వాడారో దేశ ప్రజలకు చెప్పాలిన బాధ్యత ఇందిరాగాంధీ, ఫిరోజ్ ఖాన్ ల మనుమడు అయిన రాహుల్ గాంధీపై ఉందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చి ఇందిరా కోడలు సోనియా గాంధీ 2011 లో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ముస్లిం ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజర్వేషన్ల ను తొలగించి వారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ల పేర్లను కూడా మార్చే అవకాశం ఉందన్నారు. అందులో సీట్లు కూడా కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ధి చేకూరే

విధంగా రిజర్వేషన్లను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. కావున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీకి 400 సీట్లు రావని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా వ్యవహరిస్తాయని అనడంపై విలేకరులు అరవింద్​ను ప్రశ్నించగా కేసీఆర్ ఎప్పుడు వచ్చాడో తనకు తెలవదని వ్యాఖ్యానించారు. విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ న్యాళం రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story