తృటిలో తప్పిన పెను ప్రమాదం…పెట్రోల్ పంపులో తగలబడిన లారీ

by Kalyani |
తృటిలో తప్పిన పెను ప్రమాదం…పెట్రోల్ పంపులో తగలబడిన లారీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరిలోని ఓ పెట్రోల్ పంపులో తోటిలో ప్రమాదం తప్పింది.‌ పెట్రోల్ బంకులోకి వచ్చిన లారీ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం భువనగిరిలోని నల్గొండ రోడ్డులో చోటు చేసుకుంది. డీజిల్ కోసం వచ్చిన లారీ డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో ట్యాంక్ లో ఉన్న డీజిల్ తో పెద్ద మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story