UPSC సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ - 2023

by Disha Web Desk 17 |
UPSC సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ - 2023
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్ - 2023 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 322.

పోస్టుల వివరాలు :

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్ - 2023

బీఎస్ఎఫ్ - 86

సీఆర్‌పీఎఫ్ -55

సీఐఎస్ఎఫ్ -91

ఐటీబీపీ - 60

ఎస్ఎస్‌బీ - 30

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష(పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరి తేదీ: మే 16, 2023.

ఎగ్జామ్ డేట్: జులై 6, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in/


ఇవి కూడా చదవండి:

రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు

Next Story

Most Viewed