JIO కస్టమర్లకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ స్పెషల్ ప్యాక్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-12-26 07:18:23  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ జియో టెలికం సంస్థ తన కస్టమర్లకు న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఆఫర్‌ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్ జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. స్పెషల్ ప్యాక్ వివరాలు.. రూ.2,545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తున్నట్టు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులే కాగా.. ఆఫర్‌ కింద [&hellip;]</p>

JIO కస్టమర్లకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ స్పెషల్ ప్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ జియో టెలికం సంస్థ తన కస్టమర్లకు న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఆఫర్‌ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్ జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

స్పెషల్ ప్యాక్ వివరాలు..

రూ.2,545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తున్నట్టు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులే కాగా.. ఆఫర్‌ కింద 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్‌తో రీఛార్జి చేసుకున్న వారు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది.

సెక్స్ రాకెట్‌లో సినీ నిర్మాత.. 13 ఏళ్ల బాలికతో 23 మంది

Next Story