సెక్స్ రాకెట్‌లో సినీ నిర్మాత.. 13 ఏళ్ల బాలికతో 23 మంది..

by  |
prostitute
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయి అయితే చాలు.. ఆమె వయసుతో సంబంధం లేకుండా కామ కోరికలు తీర్చే వస్తువుగా మార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పదేళ్లు దాటితే చాలు.. ముక్కుపచ్చలారని చిన్నారులని కూడా చూడకుండా సెక్స్ బొమ్మగా మార్చి డబ్బులను పోగు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరులో కరోనాతో అనారోగ్యం పాలైన 13 ఏళ్ల చిన్నారిని తీసుకెళ్లి వ్యభిచారం చేయించిందో ముఠా. ఈ ముఠాలో ఓ సినీ నిర్మాత కూడా ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం..

డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్

girl

గుంటూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం జూన్‌లో కరోనా బారిన పడింది. భార్యకు, 13 ఏళ్ల కూతురుకు కరోనా పాజిటివ్ రావడంతో భర్త గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ భార్య మరణించింది. ఆ తర్వాత కోలుకున్న కూతురు తండ్రితో కలిసి స్వగ్రామంలో ఉంటుంది. అయితే పేదరికంతో అల్లాడుతున్న ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న బాలిక కొద్ది రోజులకే అనారోగ్యానికి గురైంది. ఆమెకు వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వారితో మాటలు కలిపింది. తనకు తెలిసిన వారి వద్ద ఉచితంగా నాటు వైద్యం చేయిస్తానని బాలికను తీసుకెళ్లింది. తండ్రి తప్ప మరెవరు లేకపోవడంతో ఆ బాలిక మహిళతో కలిసి ఒంటరిగా వెళ్లింది.

Rape

అలా బాలికను తీసుకొచ్చిన మహిళ ఆమెను వైద్యం చేయించకుండా బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. తనకు ఇష్టం లేదని చెప్పినా.. బాలికను విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు, నెల్లూరు తిప్పుతూ వ్యభిచారం చేయించింది. వచ్చిన ప్రతి విటుడి వద్దకు పంపింది. మహిళతో పాటు 10 మందికి పైగా ఉన్న ఈ ముఠా.. బాలికను చిత్రవధ చేసి బలవంతంగా సెక్స్ చేయించారు. వారి చిత్రహింసలు తట్టుకోలేని బాలిక నెల్లూరులో వారి చర నుంచి తప్పించుకుని తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆ తర్వాత గుంటూరు బయలుదేరిన బాలికను విజయవాడలో మరో వ్యభిచార ముఠా పట్టు్కుంది.

sex racket

విజయవాడలో ఆమెతో వ్యభిచారం చేయించారు. మరోవైపు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా బాలిక ఆచూకీని గుర్తించి వారి చర నుంచి రక్షించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా.. వారిలో 10 మంది వ్యభిచార ముఠా నిర్వహకులు ఉన్నారు. ఈ దందాలో మరికొంత ఉన్నారని, వారిని తర్వలో అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వ్యభిచార ముఠాకు ప్రధాన సూత్రదారిగా ఉన్న మహిళ ఓ సినీ నిర్మాతగా పోలీసులు గుర్తించారు. ఆమె ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.


Next Story