రిలయన్స్ జియోకు బిగ్ షాక్..

by  |
రిలయన్స్ జియోకు బిగ్ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టెలికాం సంస్థ, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు భారీ షాక్ తగిలింది. యూజర్లు జియో వద్దంటూ భారతీ ఎయిర్‌టెల్‌‌కు కన్వర్ట్ అవుతున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో దాదాపు 1.9 కోట్ల మంది యాజర్లను కోల్పోయింది.

కాగా, అదే సమయంలో 2.74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. వొడాఫోన్ ఐడియాకు కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. ఈ కంపెనీ కూడా 10.8 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. గత పదకొండు నెలలనుంచి యూజర్లు వోడాఫోన్‌ ఐడియాను వీడుతూనే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌తో నిలవగా.. జియో 4.29శాతం మేర క్షీణించింది. అయితే.. చాలా ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా రావడం లేదన్న కారణంగానే యూజర్లు ఈ నెట్‌వర్క్‌ను వీడుతున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు షాకిచ్చిన విషయం తెలసిందే. నవంబర్ 26 నుంచి ప్రిపెయిడ్ టారిఫ్ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధరల పెరుగుదల 25 శాతం వరకు ఉండనుంది.

రాహుల్ ద్రవిడ్ నా ఫస్ట్ లవ్.. నటి హాట్ కామెంట్స్ వైరల్


Next Story

Most Viewed