- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. 36 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ
జైపూర్ మైదానంలో పరుగుల వరద పారింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.

దిశ, వెబ్‌డెస్క్: జైపూర్ మైదానంలో పరుగుల వరద పారింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే వైభవ్ ఆ శైలిని ప్రదర్శించాడు. హైదరాబాద్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 92 పరుగులు రావడం విశేషం. బంతి ఎక్కడ వేసినా అది స్టేడియం బయట పడాల్సిందే అన్నట్లుగా వైభవ్ చెలరేగిపోయాడు.
చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
వైభవ్ దాటికి హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయులైపోయారు. సరైన లెంగ్త్‌లో బంతులు వేసినా, వైవిధ్యమైన బంతులతో కట్టడి చేయాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. వైభవ్ ధాటికి హైదరాబాద్ ప్రధాన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుని చేతులెత్తేశారు. మైదానంలోని అభిమానులు వైభవ్ కొడుతున్న ఒక్కో సిక్సర్‌కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. భవిష్యత్తులో ఈ యువ ఆటగాడు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






