- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ బిర్యానీ తిని, కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
బిర్యానీ తిని కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్ ను చూసి, కెప్టెన్ ఇషాన్ కిషన్, ఇతర ప్లేయర్లు పగలబడి నవ్వారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోరు ఊరుతుంది. ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీకి ఉన్న పాపులారిటీ మరో దానికి లేదు. హైదరాబాద్ అంటేనే బిర్యానీ అన్న రేంజ్ కు పరిస్థితి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు హైదరాబాద్ బిర్యానీని ఆరగించారు. ఈ సందర్భంగా SRH ప్లేయర్ క్లాసెన్ హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మసాలా ఘాటు గట్టిగా తగలడంతో అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దీంతో వెంటనే కర్చీఫ్ తో నీళ్లను తుడుచుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ బిర్యానీ తిన్న సన్ రైజర్స్ ప్లేయర్లు
ఇక బిర్యానీ తిని కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్ ను చూసి, కెప్టెన్ ఇషాన్ కిషన్, ఇతర ప్లేయర్లు పగలబడి నవ్వారు. హైదరాబాద్ అంటేనే మసాలా ఘాటు, ఇంత మాత్రానికే కన్నీళ్లు పెట్టుకుంటావా ?అంటూ ఆట పట్టించారు. వాస్తవంగా క్లాసెన్ ది దక్షిణాఫ్రికా. అక్కడ పచ్చి దుంపలు, ఎండిపోయిన కూరగాయలు తింటూ ఉంటారు. మనలాగా మసాలా ఘాటుతో ఎలాంటి ఫుడ్ దొరకదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బిర్యానీ తిని, కన్నీళ్లు పెట్టుకున్నాడు క్లాసెన్.






