- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 మ్యాచ్ లలో వివాదాలు..సన్ రైజర్స్ షాకింగ్ నిర్ణయం
సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ లలో కూడా మూడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు అంపైర్లు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్ కొంప ముంచుతున్నాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ లలో కూడా మూడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు అంపైర్లు.. మొదట బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా క్లాసెన్ క్యాచ్ ను సాల్ట్ పట్టుకోవడం వివాదంగా మారింది. అయినప్పటికీ ఔట్ గా ప్రకటించారు. ఇక రెండో మ్యాచ్ కేకేఆర్ తో జరగగా, ఆ సందర్భంగా అభిషేక్ శర్మ క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి నేలకు తాకిన తర్వాత పట్టుకున్నాడు.
లక్నో పైన ఐదు పరుగుల పెనాల్టీ
అయినప్పటికీ థర్డ్ అంపైర్ మరోసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్, లక్నో మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా రిషబ్ పంత్ కొట్టిన బాల్ బౌండరీ లైన్ దాటకముందు అవేశ్ ఖాన్ తన బ్యాట్ తో లోపలికి కొట్టాడు. అంపైర్లు సరిగ్గా నిర్ణయం తీసుకుంటే లక్నో పైన ఐదు పరుగుల పెనాల్టీ పడేది. ఫలితంగా హైదరాబాద్ విజయం సాధించేదని అంటున్నారు. ఇక్కడ కూడా అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా హైదరాబాద్ కు నష్టం జరిగిందని అంటున్నారు. అయితే ఈ మూడు సంఘటనలపై బీసీసీఐకి ఫిర్యాదు చేసేందుకు కావ్య మారన్ సిద్ధమయ్యారని అంటున్నారు.






