Shefali Bagga : చాహల్ వద్దు.. నాకు కోహ్లీ లాంటోడు కావాలి..!

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 14:59:53  IST  )

చాహల్ తో డేటింగ్ వార్తలపై తాజాగా షెఫాలి బగ్గ క్లారిటీ ఇచ్చారు.

Shefali Bagga : చాహల్ వద్దు.. నాకు కోహ్లీ లాంటోడు కావాలి..!
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య ధన శ్రీ వర్మకు విడాకులు ఇచ్చి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరైనా అమ్మాయిలు ఛాన్స్ ఇస్తే, వాళ్లతో చిల్ కూడా అవుతున్నాడు. ఈ మధ్య షెఫాలి బగ్గతో కూడా చాహల్ మెరిసిన సంగతి తెలిసిందే. నైట్ పార్టీల‌కు ఈ జంట వెళ్లింది. దీంతో షెఫాలి బగ్గ, చాహ‌ల్ మధ్య సంథింగ్ ఉందని అందరు అనుకున్నారు.

చాహల్ లాంటోడు నాకొద్దు

ఇక ఈ డేటింగ్ వార్తలపై తాజాగా షెఫాలి బగ్గ క్లారిటీ ఇచ్చారు. చాహల్ తో తనకు ఎలాంటి రిలేష‌న్ లేదని.. కేవలం అతడు స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. కావాలనే కొంతమంది తప్పుడు పోస్టులు పెట్టి, తనను టార్చర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు షెఫాలి బగ్గ. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. చాహల్ లాంటోడిని అస్సలు సెలెక్ట్ చేయబోనని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు విరాట్ కోహ్లీ లాంటివాడు కావాలని వెల్లడించారు. అలాంటివాడు దొరికితే కచ్చితంగా మీడియాకు తానే స్వయంగా చెబుతానని పేర్కొన్నారు. దీంతో షెఫాలి బగ్గ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై చాహల్ స్పందించాల్సి ఉంది.

Read More.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నిమ్మకాయలు

Next Story