ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నిమ్మకాయలు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-21 13:27:06  IST  )

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హవా! ఫ్యాన్స్ వద్ద నిమ్మకాయల సెక్యూరిటీ చెక్.. కావ్య పాప సెంటిమెంట్ మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ.

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నిమ్మకాయలు
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్ ఉందంటే గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం తప్పదనే ట్రెండ్ కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సిక్సర్ల కంటే సోషల్ మీడియాలో 'నిమ్మకాయల' ట్రెండింగ్ (Lemons' trending) ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు మ్యాచ్‌లుగా ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో, నెటిజన్లు దీన్ని కేవలం ఆటగాళ్ల ప్రతిభ గానే కాకుండా నిమ్మకాయల బ్లాక్ మ్యాజిక్ కూడా కారణం అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యర్థుల వికెట్లు తీయడం కోసం ఎవరో ఒకరు సీటు కింద నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారంటూ మీమ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రత్యర్థి టీమ్ వికెట్లు పడుతున్నా , ఎస్‌ఆర్‌హెచ్ (SRH) బ్యాటర్లు చితక్కొడుతున్నా.. "ఇదంతా నిమ్మకాయల ఎఫెక్టే, మా మంత్రాల దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తుతున్నారు" అని ఫ్యాన్స్ సరదాగా పోస్టులు పెడుతున్నారు. స్టేడియం బయట టిక్కెట్ల కంటే నిమ్మకాయలకే డిమాండ్ ఎక్కువైందని, గూగుల్ మ్యాప్స్‌లో ఉప్పల్ స్టేడియం కాస్తా 'నిమ్మకాయల స్టేడియం'గా మారిపోయిందంటూ వస్తున్న మీమ్స్ క్రికెట్ ప్రేమికులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలంటే బ్యాట్లే కాదు.. నిమ్మకాయలు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాయి. దీనికి కారణం చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఓ వ్యక్తి నిమ్మకాయతో ఏదో మంత్రం వేస్తున్నట్లు నటించగా.. వెంటనే క్రీజులో ఉన్న దుబే క్లీన్ బౌల్డ్ అవ్వడం వైరల్ అయింది. దీంతో చెన్నై యాజమాన్యం తమ జట్టుకు నిమ్మకాయలతో బ్లాక్ మ్యాజిక్ చేశారని ఫిర్యాదు చేసినట్లు చూపించే లెటర్ ను సైతం వైరల్ గా మార్చారు. దీంతో నేటి మ్యాచ్ సందర్భంగా నిమ్మకాయలను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హైదరాబాద్ లో వర్షం... SRH మ్యాచ్ కు అంతరాయం !

నేడు ఢిల్లీతో స‌న్ రైజ‌ర్స్ ఫైట్..హ్యాట్రిక్ కొడుతుందా !

Next Story