హైదరాబాద్ లో వర్షం... SRH మ్యాచ్ కు అంతరాయం !

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 13:24:38  IST  )

హైదరాబాద్ లో వర్షం ప‌డే ఛాన్సులు ఉన్న త‌రుణంలో SRH మ్యాచ్ కు అంతరాయం ఏర్ప‌డుతుంద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

హైదరాబాద్ లో వర్షం... SRH మ్యాచ్ కు అంతరాయం !
X

దిశ‌, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ ఢిల్లీ మధ్య జ‌రిగే మ్యాచ్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ మహా నగరంలో రానున్న 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, భూపాల పల్లి, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడే ఛాన్సులు ఉన్నట్లు పేర్కొంది.

ఉప్ప‌ల్ మ్యాచ్ కు వ‌ర్షం అంత‌రాయం ?

ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో ఢిల్లీతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో హైదరాబాద్ లో వర్షం పడితే, మ్యాచ్ కు అంతరాయం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న అభిమానులు, వర్షం పడకూడదని వరుణ దేవుణ్ణి కోరుతున్నారు. అయితే హైదరాబాద్ మహానగరంలో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడతాయని, దీంతో మ్యాచ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడినా తొందరగానే ఆగిపోతుందని, గంటల తరబడి పడే ఛాన్సులు లేదని వెల్లడిస్తున్నారు. మరి మ్యాచ్ ప్రారంభానికి వర్షం పడుతుందా ? లేదా? అనేది చూడాల్సి ఉంది.

నేడు ఢిల్లీతో స‌న్ రైజ‌ర్స్ ఫైట్..హ్యాట్రిక్ కొడుతుందా !

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నిమ్మకాయలు

Next Story