- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పట్లో ధోని, రాహుల్ ను అవమానించాడు..ఇక ఇప్పుడు పంత్ ను కూడా!
ధోని, రాహుల్ లాగానే పంత్ ను కూడా అవమానించాడని సంజీవ్ గోయెంకాపై విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సందర్భంగా LSG ఓనర్ సంజీవ్ గోయెంకాపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత LSG కెప్టెన్ రిషబ్ పంత్ ను సంజీవ్ తిట్టినట్లు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పంత్ వైఫల్యం కారణంగానే జట్టు ఓడిపోయిందని ఈ సందర్భంగా సంజీవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత పంత్, కోచ్ లాంగర్ ఇద్దరిని కూడా ఓనర్ సంజీవ్ తిట్టినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీంతో LSG ఓనర్ సంజీవ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ ఓడిపోతే, ఇలా కెప్టెన్ ను తిట్టడం ఏమాత్రం సమంజసం ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
గతంలో ధోని, కే ఎల్ రాహుల్ కు ఇదే అవమానం
LSG కెప్టెన్ రిషబ్ పంత్ ను అవమానించినట్లుగానే గతంలో మహేంద్ర సింగ్ ధోని, కేఎల్ రాహుల్ ను కూడా సంజీవ్ గోయెంకా అవమానించినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ జట్టు తరఫున ధోని ఆడినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాడు సంజీవ్ గోయెంకా. ఇక 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడినప్పుడు అప్పటి లక్నో కెప్టెన్ రాహుల్ ను కూడా ఇలాగే సంజీవ్ అవమానించాడు. అందరి ముందే సీరియస్ డిస్కషన్ పెట్టి రాహుల్ కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోగా.. పంత్ ను కొనుగోలు చేశాడు సంజీవ్. అయినప్పటికీ కూడా లక్నో తలరాత మారడం లేదు.






