CSKకు బిగ్ రిలీఫ్‌..ఇక అత‌డు వ‌చ్చేస్తున్నాడు

by velandi.Saikiran |   (  Updated:2026-04-02 11:58:46  IST  )

మొదటి మ్యాచ్ కు దూరమైన మిస్టర్ కూల్ ధోని, తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

CSKకు బిగ్ రిలీఫ్‌..ఇక అత‌డు వ‌చ్చేస్తున్నాడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. మొదటి మ్యాచ్ కు దూరమైన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ప్రాక్టీస్ సెషన్ లో సందడి చేశాడు మహేంద్ర సింగ్ ధోని. సిక్సర్లు, బౌండరీలు కొడుతూ చెన్నై స్టేడియంలో నూతన ఉత్సాహం నింపాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. రేపు చెన్నై వేదిక గానే ఈ రెండు జట్లు తలపడతాయి. మొట్ట మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, సొంత గడ్డపై ఎలాగైనా పంజాబ్ ను మట్టి కనిపించాలని స్కెచ్ వేస్తోంది.

గాయం నుంచి కోలుకున్న ధోని ?

ఇందులో భాగంగానే ధోని కూడా తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మొన్న గాయం కారణంగా మొదటి మ్యాచ్ కు ధోని దూరం అయ్యాడు. అయితే ప్రస్తుతానికైతే మహేంద్ర సింగ్ ధోని ఫిట్ గా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే రెండో మ్యాచ్ లో ధోని రంగంలోకి దిగుతాడు. ధోని వస్తే సంజు ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. అటు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ పై వేటు ప‌డే ఛాన్సు ఉంటుంది. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉంటే, చెన్నై ప్లేయర్లు రెచ్చిపోయి ఆడే ఛాన్సులు ఉంటాయి. అందుకే ఈ స్ట్రాటజీని రెండో మ్యాచ్ లో వర్కౌట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఉర్విల్ పటేల్ , సంజు, రామకృష్ణ గోష్, ప్రశాంత్ వర్మ, సర్ఫ్ రాజ్ ఖాన్, రుతురాజ్ లాంటి యంగ్ స్టార్ లతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బలంగానే కనిపిస్తోంది. కానీ మొదటి మ్యాచ్ లో మాత్రం ప్లేయర్లు తడబడి ఓడిపోయారు. కానీ రెండో మ్యాచ్ లో రెచ్చిపోతామని చెబుతున్నారు.

అప్పట్లో ధోని, రాహుల్ ను అవమానించాడు..ఇక ఇప్పుడు పంత్ ను కూడా!

Next Story