- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్జున్.. వెల్డన్ మై బాయ్ : సచిన్ భావోద్వేగం
ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా LSG జట్టు తరపున తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టిన తన కుమారుడు అర్జున్ పై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు తరపున తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టిన తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో తరపున అరంగేట్రం చేసిన అర్జున్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, బౌలింగ్‌లో ఒక కీలకమైన వికెట్ పడగొట్టి జట్టులో తన ఉనికిని చాటుకున్నారు. ఈ ప్రదర్శన అనంతరం సచిన్ ఎక్స్(X) వేదికగా స్పందిస్తూ, "వెల్డన్ అర్జున్.. ఈ సీజన్ మొత్తం నువ్వు నడుచుకున్న తీరును చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
అవకాశం వచ్చేంతవరకు బెంచ్‌కే పరిమితమైనా, నిరాశ చెందకుండా చివరి వరకు ఓపికగా ఎదురుచూడటాన్ని సచిన్ ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ అనేది కేవలం ఆటలోని నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, ఒక ఆటగాడికి ఉండాల్సిన సహనాన్ని, మానసిక స్థైర్యాన్ని కూడా తీవ్రంగా పరీక్షిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ ఒత్తిడితో కూడిన పరిస్థితులన్నింటినీ అర్జున్ ఎంతో పరిణతితో, సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడని మెచ్చుకుంటూ.. భవిష్యత్తులో కూడా తన ఆటతీరును, ఇదే విధమైన పట్టుదలను ఇలాగే కొనసాగించాలని సచిన్ టెండూల్కర్ తన కుమారుడికి దిశా నిర్దేశం చేశారు.






