- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KKR vs RCB మ్యాచ్‌కు వర్షం అంతరాయం
IPL లో నేడు జరగాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : IPL లో భాగంగా రాయ్‌పుర్ వేదికగా నేడు జరగాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఇంతవరకు టాస్ కూడా పడకపోవడంతో, ఈ కీలక పోరు వర్షార్పణం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. బెంగుళూరు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఒక పాయింట్‌తో కలిపి మొత్తం 12 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించి, టేబుల్‌లో 2వ స్థానంలో తన పట్టును నిలుపుకుంటుంది. ఇక కోల్‌కతాకు ఒక పాయింట్ లభించడం ద్వారా 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లు పొంది, పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం రాయ్‌పుర్‌లో వర్షం కురుస్తూనే ఉంది. మ్యాచ్ ప్రారంభం కావాలంటే వర్షం తగ్గి, గ్రౌండ్ సిద్ధం కావడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. అయితే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు సమాచారం.






