- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లోనూ భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నం.1 స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇతర దేశాల స్టార్ బౌలర్ల నుంచి పోటీ ఎదురైనప్పటికీ అతను 879 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలోనే ఉన్నాడు. భారత్ తరపున మహ్మద్ సిరాజ్ సెకండ్ హయ్యెస్ట్ ర్యాంక్ బౌలర్‌గా ఉన్నాడు. అతను 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వరుసగా 14వ, 15వ స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ పేసర్ హెన్రీ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకుని 2వ, 3వ ర్యాంక్‌ల్లో నిలువగా ఆసిస్ కెప్టెన్ కమిన్స్ 4వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. భారత్ నుంచి యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ టాప్-10లోనే ఉన్నారు. జైశ్వాల్ 8వ స్థానంలో కొనసాగుతుండగా.. గిల్ 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టీమిండియా టెస్టులు ఆడి ఆరు నెలలకుపైనే అవుతుంది. ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చివరిసారిగా నవంబర్‌లో సౌతాఫ్రికాతో తలపడింది. అయినప్పటికీ భారత ఆటగాళ్లు తమ ర్యాంక్‌లను నిలబెట్టుకోవడం విశేషం. భారత జట్టు జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. అనంతరం వన్డే వరల్డ్ కప్-2027 కోసం వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టనుంది.






