- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ కుర్రాడికి హగ్ ఇచ్చిన ప్రీతి జింటా
గెలిచిన ఆనందంలో పంజాబ్ కుర్రాడు ప్రియాంశ్ ఆర్యకు టైట్ హగ్ ఇచ్చారు ప్రీతి జింటా.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆమె వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా... యంగ్ హీరోయిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అందాల తార ప్రీతి జింటా, ప్రస్తుతం ఐపీఎల్ బిజీలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ, సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యకు హగ్ ఇచ్చింది ప్రీతి జింటా. ఢిల్లీ క్యాపిటల్స్ పైన విజయం సాధించిన నేపథ్యంలో ప్లేయర్లతో సరదాగా గడిపిన ప్రీతి జింటా, ఈ కుర్రాడికి హాగ్ ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
పంజాబ్ కింగ్స్ భారీ విక్టరీ
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ సేన, ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 264 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని కేవలం 18.5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 152 పరుగులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.






