- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలితో అర్ష్‌దీప్ సింగ్ ఎంజాయ్.. వీడియో వైరల్!
సమ్రీన్ చేయి పట్టుకొని అర్ష్‌దీప్ సింగ్ వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్రారంభమైనప్పటి నుంచి భారత క్రికెటర్లు చాలా రిలాక్స్ అవుతున్నారు. తమ భార్యలు, ప్రియురాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రాంచైజీలు కఠినమైన రూల్స్ పెట్టకపోవడంతో ఐపీఎల్ ఆడే భారత క్రికెటర్లందరూ తమ ఫ్యామిలీ మెంబర్లతో జాలిగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ స్టార్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ కూడా తన ప్రియురాలిని పరిచయం చేశాడని వార్తలు వస్తున్నాయి. పంజాబీ నటి సమ్రీన్ కౌర్ తో ( Samreen Kaur) అర్ష్‌దీప్ సింగ్ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్ కు కూడా నటి సమ్రీన్ కౌర్ హాజరవుతున్నారు. ఇక తాజాగా ఈ ఇద్దరు మరోసారి మీడియా కంటపడ్డారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి సమ్రీన్ ను కూడా అర్ష్‌దీప్ సింగ్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమ్రీన్ చేయి పట్టుకొని అర్ష్‌దీప్ సింగ్ వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. అయితే అధికారికంగా తమ బంధంపై ఇప్పటి వరకు ఈ ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు.






