MI vs PBKS: టాస్ గెలిచిన ముంబై

by Muthe.Rajitha |   (  Updated:2026-05-14 14:15:01  IST  )

ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు ముంబై, పంజాబ్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ కాసేపట్లో మొదలవనుంది.

MI vs PBKS: టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు ముంబై, పంజాబ్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ కాసేపట్లో మొదలవనుంది. కాగా టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగుకు దిగనుంది. కాగా ఈ మ్యాచులో హార్దిక్, సూర్య కుమార్ హాజరు కానందున ముంబై జట్టు కెప్టెన్ గా బుమ్రా వ్యవహరించనున్నాడు. కాగా ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో 9వ స్థానంలో ఉన్న ముంబయి.. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే వైదొలగగా, ఈ మ్యాచ్‌ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది.

ముంబై జట్టు : రికెల్టన్, నమన్, తిలక్, రూథర్ ఫోర్డ్, జాక్స్, రాజ్ బవా, బోష్, దీపక్ చాహర్, శార్దూల్, బుమ్రా, రఘుశర్మ

పంజాబ్ జట్టు : ప్రభ్ మన్ సింగ్, ప్రియాన్స్, కూపర్, శ్రేయాస్, సూర్యన్స్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, యన్సెన్, బార్ట్ లెట్, అర్ష్ దీప్, చాహల్

ముంబైకి మరో కొత్త కెప్టెన్!

Next Story