- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైకి మరో కొత్త కెప్టెన్!
ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు ముంబై, పంజాబ్ మధ్య పోరులో ముంబయి పగ్గాలు కొత్త కెప్టెన్ చేతుల్లోకి చేరనున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు ముంబై, పంజాబ్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ముంబయి పగ్గాలు కొత్త కెప్టెన్ చేతుల్లోకి చేరనున్నట్టు సమాచారం. ముంబయి రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ఇప్పటికే గత రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా పంజాబ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలలో ఒకరికి అప్పగించే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ చేపట్టే అవకాశం తక్కువగానే ఉండటంతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త నాయకుడిని పరీక్షించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తునట్టు సమాచారం. కాగా ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో 9వ స్థానంలో ఉన్న ముంబయి.. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే వైదొలగగా, ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.






