తిలక్ వర్మ వీర విధ్వంసం: 45 బంతుల్లోనే 'సునామీ' సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 16:38:04  IST  )

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించాడు.

తిలక్ వర్మ వీర విధ్వంసం: 45 బంతుల్లోనే సునామీ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ యువ సంచలనం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయ సెంచరీ (101)* బాది, ముంబయి ఇండియన్స్‌కు భారీ స్కోరును అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ముంబయి ఇండియన్స్ 199 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్‌పై ఈ లక్ష్యం ఛేదించడం గుజరాత్‌కు సవాలుతో కూడుకున్నదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. తిలక్ వర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోనుంది. అంతకుముందు నమన్ ధిర్ కూడా 32 బంతుల్లో 45 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడా మూడు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.

Read More.. కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇంతగా ఎమోషనల్ అవ్వలేదు: వరుణ్ చక్రవర్తి

Next Story