SRH vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో..

by Ramesh Naini |   (  Updated:2026-04-05 16:31:55  IST  )

ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.

SRH vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటివరకు ఆడిన రెండు అవే మ్యాచ్‌లలో ఒక గెలుపు, ఒక ఓటమి చవిచూసిన హైదరాబాద్‌.. సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగింది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైన లక్నో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌

బ్యాటింగ్‌కు సిద్ధమైన హైదరాబాద్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమీ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతిని అభిషేక్‌ ఫ్లిప్‌ చేశాడు. బ్యాట్‌ ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ను తాకి బంతి గాల్లోకి లేచింది. దాన్ని సిద్ధార్థ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. ఇక, ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఎస్ఆర్‌హెచ్‌కు వచ్చింది.

Read more..ఉప్పల్ స్టేడియంలోకి ఆ వస్తువులపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

Next Story