- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్ స్టేడియంలోకి ఆ వస్తువులపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి! పవర్ బ్యాంకులు, ఇయర్ బడ్స్‌పై పోలీసుల నిషేధం. క్లోక్‌రూమ్ సౌకర్యం లేదు.. నిబంధనలు పాటిస్తేనే లోపలికి అనుమతి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Rajiv Gandhi International Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధం కాగా.. తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మ్యాచ్‌కు వచ్చే వేలాది మంది అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీసులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. స్టేడియంలోకి సెల్ఫీ స్టిక్స్, ఇయర్ ఫోన్ బడ్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు, కెమెరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, బయట ఆహార పదార్థాలు, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్, బ్యానర్లపై కూడా నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించి నిషేధిత వస్తువులను తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
స్టేడియం వద్ద వస్తువులు రూమ్ దాచుకునే సౌకర్యం లేదని, కాబట్టి అభిమానులు పైన పేర్కొన్న వస్తువులను వెంట తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు. గేట్ల వద్ద తనిఖీల సమయంలో దొరికిన నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుంటారని, వాటిని తిరిగి ఇవ్వడం జరగదని వెల్లడించారు. సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, 430 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. తనిఖీల వద్ద రద్దీని నివారించేందుకు మ్యాచ్ ప్రారంభానికి కనీసం మూడు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలని, వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు క్రికెట్ అభిమానులను కోరారు.






