- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ అంటేనే బిజినెస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ కోచ్

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంటేనే పెద్ద బిజినెస్ అంటూ వ్యాఖ్యానించాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ప్రతి జట్టు 200 స్కోరు చేయడం సాధారణమైపోయింది. బౌలర్లు నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు. దీనిపై మురళీధరన్ స్పందిస్తూ.. ఇందులో బౌలర్ల తప్పేం లేదని, ఐపీఎల్ స్ట్రక్చరే అలా ఉందన్నాడు. పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండటం, బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయన్నాడు. అలాగే, బౌలర్లకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేస్తే అభిమానులకు మ్యాచ్ బోర్ కొడుతుందని చెప్పాడు. అభిమానులు ఎంటర్‌టైన్‌మెంట్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సిక్స్‌లు, ఫోర్లు చూడటాన్ని ఇష్టపడుతున్నారన్నాడు. ‘ఐపీఎల్‌ను క్రికెట్ అభివృద్ధి కోసలా చూడటం లేదు.ఐపీఎల్‌ను ఎంటైర్‌టైన్మెంట్ కోసమే రూపొందించారు. ప్రస్తుతం ఈ టోర్నీ పెద్ద వ్యాపారం. గేము ఆసక్తిగా లేకపోతే స్పాన్సర్లను కోల్పోతారు. అభిమానులు కూడా రారు.’అని తెలిపాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు పూర్తవ్వగా అందులో 31 గేముల్లో జట్లు 200లకుపైగానే స్కోరు చేశాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించిన విషయం తెలిసిందే.






