- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరేట్ తాగడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఓ జట్టుకు కెప్టెన్ అయి ఉండి ఇలా క్రీడకు అపకీర్తి తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పరాగ్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. అతనికి జరిమానా విధించింది. పరాగ్ ఆటకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తించాడని ఐపీఎల్ తెలిపింది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం.. అతను లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. తాను తప్పు చేసినట్టు రియాన్ పరాగ్ ఒప్పుకున్నాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టడమే కాకుండా ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.
కఠిన చర్యలు ఉంటాయని బీసీసీఐ వార్నింగ్
2019లో ఈ-సిగరెట్ల అమ్మకం, కొనుగోలు, వినియోగంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పరాగ్‌పై బ్యాన్ విధించొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుతానికి బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది. ఐపీఎల్ రూల్ బుక్‌లో డ్రెస్సింగ్ రూంలో నిషేధిత వస్తువును వాడితే శిక్షించేందుకు స్పష్టమైన నిబంధనలు లేవని పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ లొసుగు వల్లే పరాగ్‌ను ఫైన్‌తో విడిచిపెట్టారని చెప్పాయి. అయితే, బీసీసీఐ మాత్రం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్ఠకు భంగం కలిగించిన జట్టు, దాని అధికారులు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా తెలిపారు. అలాగే, ఆ మ్యాచ్ రిఫరీపై కూడా చర్యలు తీసుకోనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నిషేధిత వస్తువు డ్రెస్సింగ్ రూంలోకి ఎలా తీసుకెళ్లాడన్న విషయంపై బీసీసీఐ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో అధికారుల వైఫల్యం ఉందని, దానికి మ్యాచ్ రిఫరీని బోర్డు బాధ్యుడి చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని బోర్డు భావిస్తున్నట్టు అధికారి ఒకరు పేర్కొన్నాయి.






