ధోనికి భార‌త మాజీ క్రికెట‌ర్ వార్నింగ్.. నేనే మెడలు పట్టి !

by velandi.Saikiran |   (  Updated:2026-05-18 14:59:21  IST  )

దయచేసి మహేంద్రసింగ్ ధోని ఆడాలని రిక్వెస్ట్ చేసిన హర్భజన్... అతడు ఆడకపోతే తానే ప్రేక్షకుల మధ్యలోకి తీసుకువెళ్తానని ఫన్నీగా హెచ్చరించారు.

ధోనికి భార‌త మాజీ క్రికెట‌ర్ వార్నింగ్.. నేనే మెడలు పట్టి !
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, SRH మధ్య ఇవాళ చెపాక్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో కచ్చితంగా ధోని ఆడతాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా ప్రచారం జోరు అందుకుంది. కానీ చివరి క్షణంలో మహేంద్ర సింగ్ ధోని అందరికీ షాక్ ఇచ్చాడు. ఫిట్ నెస్ లేదని ధోని తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి క్రమంలో ధోనిపై హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

దయచేసి మహేంద్రసింగ్ ధోని ఆడాలని రిక్వెస్ట్ చేసిన హర్భజన్... అతడు ఆడకపోతే తానే ప్రేక్షకుల మధ్యలోకి తీసుకువెళ్తానని ఫన్నీగా హెచ్చరించారు. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఆడుతోంది... కచ్చితంగా ధోని ఆడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా సరే, ప్లేయింగ్ 11లో ఉంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుందని వివరించారు. దయచేసి తన అభిమానుల కోసమైనా ధోని ఆడాలని వ్యాఖ్యానించారు హర్భజన్ సింగ్. మాజీలు భ‌జ్జీలా ఎంత చెప్పినా కూడా ధోని మాత్రం నేటి మ్యాచ్ లో ఆడలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు..

ఇవాళే ధోని రిటైర్మెంట్..? అశ్విన్ ట్వీట్ వైర‌ల్

Next Story