ఇవాళే ధోని రిటైర్మెంట్..? అశ్విన్ ట్వీట్ వైర‌ల్

by velandi.Saikiran |

రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇవాళ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇవ్వకపోవచ్చు అని తెలిపారు.

ఇవాళే ధోని రిటైర్మెంట్..? అశ్విన్ ట్వీట్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, SRH మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ తన హోమ్ గ్రౌండ్ లో నేడు చివరి మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి క్రమంలో మహేంద్రసింగ్ ధోని ఇవాళ తుది జట్టులో ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చెన్నై వేదికగా చివరి మ్యాచ్ ఆడిన వెంటనే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

ఇవాళ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇవ్వకపోవచ్చు అని తెలిపారు. మరో ఏడాది కాలం పాటు మహేంద్ర సింగ్ ధోని చెన్నై తరఫున బరిలో ఉంటాడని ఆయన అంచనా వేశారు. 2027 చివరలో ధోని రిటైర్మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. SRH తో ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ధోని కూడా ఆడే అవకాశాలు లేవ‌ని తెలిపారు. చేస్తే అకేల్ హోసేన్ ఒక్కడు మాత్రం తుది జట్టులో స్థానం ద‌క్కించుకుంటాడ‌ని అంచనా వేశారు. దీంతో మహేంద్రసింగ్ ధోని అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.

Next Story