అనంత్ అంబానీ రొమాంటిక్ వీడియో వైర‌ల్..ఏకంగా స్టేడియంలోనే!

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 15:02:08  IST  )

అనంత్ అంబానీ రొమాంటిక్ వీడియో వైర‌ల్ గా మారింది. ముంబై, గుజ‌రాత్ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Anant Ambani and Radhika Merchant
X

Anant Ambani and Radhika Merchant

దిశ‌, వెబ్ డెస్క్: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఐపీఎల్ 2026లో భాగంగా స్టేడియానికి వచ్చిన ఈ జంట, అందరినీ ఆకట్టుకుంటోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈనెల 20వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జాలిగా గడిపిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

ఈ మ్యాచ్ నేపథ్యంలో అంబానీ కుటుంబం మొత్తం మోడీ స్టేడియానికి వచ్చేసింది. ముఖ్యంగా అనంత్, రాధిక మర్చంట్ ఇద్దరూ కూడా స్టేడియంలో హాట్ టాపిక్ అయ్యారు. అంబానీ పక్కనే కూర్చున్న ఈ జంట, మ్యాచ్ పూర్తయ్యే వరకు జాలిగా గడిపింది. అయితే ముఖేష్ అంబానీ తన సీట్ లో నుంచి లేచి వెళ్లిపోగానే, ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని, మ్యాచ్ తిలకించారు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం 2024 జులైలో జరిగింది. కాగా ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తెనే ఈ రాధిక మర్చంట్ అన్న సంగతి తెలిసిందే. క్లిక్

Read More.. ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన విద్వంసకర బ్యాటర్

Next Story