ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన విద్వంసకర బ్యాటర్

by Malleboina Mahesh |

ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ జట్టులో చేరారు. వరల్డ్ కప్ ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తూ రేపు సీఎస్‌కేపై సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన విద్వంసకర బ్యాటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians,), గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయం సాధించి ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటోంది. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (Will Jacks) జట్టుతో చేరడం ముంబైకి కొండంత అండగా మారింది. అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల కాస్త ఆలస్యంగా చేరినప్పటికీ, నిన్న (ఏప్రిల్ 21, 2026) వాంఖడే స్టేడియంలో జాక్స్ నెట్స్‌లో చెమటోడ్చారు. భారీ సిక్సర్లు బాదడమే కాకుండా, తన ఆఫ్ స్పిన్‌తోనూ ఆకట్టుకున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో విల్ జాక్స్ విధ్వంసం సృష్టించారు.

ఒకే టోర్నీలో 4 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకుని ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే.. వరల్డ్ కప్‌లో 226 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి టాప్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే గత సీజన్లో ఆర్సీబీ కప్ గెలవడంతో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. రేపు (ఏప్రిల్ 23, గురువారం) రాత్రి 7:30 గంటలకు వాంఖడేలో జరగనున్న ఐపీఎల్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌ (MI vs CSK) లో విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాక్స్ రాకతో ముంబై టాప్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. ఫినిషర్‌గా కూడా రాణించగల సత్తా ఆయన సొంతం. హార్దిక్ సేనలో ఒక విదేశీ స్పిన్ ఆప్షన్ కొరతను కూడా ఆయన తీర్చనున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story