- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. చెన్నై ముందు 195 పరుగుల లక్ష్యం
ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై ముందు 195 పరుగుల టార్గెట్ పెట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డు స్థాయి అర్ధ శతకంతో చెలరేగగా, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచే ఓపెనర్ అభిషేక్ శర్మ (59) చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల వర్షం కురిపించిన ఈ యువ ప్లేయర్.. కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 5వ ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఏకంగా 25 పరుగులు రాబట్టి సునామీ సృష్టించాడు. తద్వారా సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వరుస షాక్‌లు.. ఆదుకున్న క్లాసెన్
దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ జెమీ ఓవర్టన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (11) తక్కువ స్కోరుకే ఔట్ అవ్వగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (0) ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో హైదరాబాద్ వరుస షాక్‌లకు గురైంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (59) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నితీష్ రెడ్డి (12) తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
చివర్లో తడబాటు..
క్లాసెన్ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సలీల్ అరోరా, లివింగ్‌స్టోన్ (1), శివాంగ్ కుమార్ లాంటి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. చివరి ఓవర్లలో అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్ కీలక వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయి 194 పరుగులకు పరిమితమైంది.






