- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కోటా ఐపీఎల్ టికెట్లు ఇన్‌ఫ్లూయెన్సర్ కుషితకు ఎలా దక్కాయి? నెట్టింట తీవ్ర దుమారం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన అత్యంత ఖరీదైన ‘ఎలైట్ లాంజ్’ టికెట్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, నటి కుషితా కల్లాపు చేతికి ఎలా వెళ్లాయన్న దానిపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఐపీఎల్ టికెట్ల పంపిణీ వ్యవహారం కొత్త వివాదానికి తెర తీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన అత్యంత ఖరీదైన ‘ఎలైట్ లాంజ్’ టికెట్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, నటి కుషితా కల్లాపు చేతికి ఎలా వెళ్లాయన్న దానిపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
ఇన్‌స్టా స్టోరీతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం..
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టికెట్లతో నటి కుషితా మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. అయితే, ఆ టికెట్లపై స్పష్టంగా సీఎం కోసం ఉద్దేశించినవి అని రాసి ఉన్న దృశ్యాలను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో రూపంలో పంచుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఎలైట్ లాంజ్ టికెట్లు ఒక్కోటి సుమారు రూ. 40,000 విలువ చేసే విలువ ఉంటుందని, ఇవి ఆమెకు ఎలా దక్కాయని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.
సీఎంవో తీరుపై నెటిజన్ల ప్రశ్నల వర్షం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఇన్ ఫ్లూయెన్సర్లకు టికెట్లు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారంటూ నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు. ఐపీఎల్ టికెట్లను సీఎంవో దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎలైట్ లాంజ్ టికెట్లను అధికారులు ఇలా పంచుతున్నారా..? లేక బ్లాక్ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకుంటున్నారా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






