tictok బ్యాన్‌.. దుమ్ములేపిన రోపోసో

by  |
tictok బ్యాన్‌.. దుమ్ములేపిన రోపోసో
X

దిశ, వెబ్ డెస్క్ :
డ్రాగన్ కంట్రీ, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు, మేడ్ ఇన్ చైనా యాప్స్‌తో ప్రమాదం పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా ఆ దేశానికి చెందిన 59 యాప్స్ బాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, టిక్‌టాక్ ‌పై నిషేధం విధించడంతో దాని ప్రత్యామ్నాయ మేన్ ఇన్ ఇండియా, అదర్ కంట్రీ యాప్స్ దుమ్ము రేపుతున్నాయి. రోపోసో, జిలి, డబ్‌స్మాష్ యాప్‌ల ఇన్‌స్టాల్స్ 3 వారాల్లో 155శాతం పెరిగాయని సెన్సార్ టవర్ అనే సర్వే వెల్లడించింది.

ఇప్పటివరకు ఆ మూడు యాప్‌లను 15.24 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా 7.1 కోట్లతో రొపోసో అగ్రస్థానంలో ఉండగా, జిలి 5.1 కోట్లతో రెండు, 3 కోట్లతో డబ్‌స్మాష్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Next Story