గోదావరిఖని ఆస్పత్రిలో పెరిగిన డెలివరీల సంఖ్య

by  |
గోదావరిఖని ఆస్పత్రిలో పెరిగిన డెలివరీల సంఖ్య
X

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా డెలివరీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే డెలివరీ అయిన బాలింతలతో ఆస్పత్రిలో బెడ్లు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో.. హాస్పిటల్ సిబ్బంది రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ఆస్పత్రిలో మరికొన్ని చోట్ల గర్భిణీ మహిళలకు బెడ్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉంచారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండే కాకుండా ప్రతిరోజు పదుల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం ఎంతో మంది ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.

పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు..

ప్రతిరోజు ఆసుపత్రికి ఓపి విభాగంతో పాటు గర్భిణీ మహిళల సంఖ్య పెరుగుతుంది. డెలివరీలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రిలో పేషెంట్లకు గర్భిణీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సిబ్బందితో కూడా చేయిస్తూ వైద్యులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్నాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం. -డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్.

రికార్డుల ఆస్పత్రిలో వైద్యుల కొరత..!


Next Story

Most Viewed