ఈ రాశివారికి నేడు పట్టిందల్లా బంగారమే.. మీరాశినేమో చూడండి

by Dishanational2 |
ఈ రాశివారికి నేడు పట్టిందల్లా బంగారమే.. మీరాశినేమో చూడండి
X

మేష రాశి : పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో తగవులకు పోకుండా ఉండాలి, అది భవిష్యత్తులో మీకే ఉపయోగకరం.వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. నూతనోత్సాహంతో పని చేస్తారు. అప్పు ఇచ్చిన వారు సమయానికి డబ్బు చేతికందిస్తారు. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : ఖర్చులు అధికం అవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. అసౌకర్యం మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంది. మీ స్నేహితుల ద్వారా సహాయ సహకారుల అందుకుంటారు.ఈరోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి : శుభకార్యల్లో పాల్గొనడం వలన ఖర్చు అధికం అవుతుంది. మీ స్నేహితుడు ముఖ్యమైన నిర్ణయం ఈరోజే తీసుకొమ్మని ఒత్తిడి చేయడం మీకు టెన్షన్‌ను కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అత్యధిక లాభదాయకం. ఆఫీసులో మీరు ఎక్కువ సేపు గడపడం వలన మీ భార్య మీపై అలిగే అవకాశం ఉంది. ఇంటా బయట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ వాటన్నింటి తట్టుకొని మీకు ఇచ్చిన వర్క్‌ను సరైన సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

సింహ రాశి : తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను పొందుతారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు,ఖర్చులను కాస్త అదుపు చేసుకోవడం ఉత్తమం.

కన్యారాశి : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడుతాయి. రోజుదీరా ద్యీపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

తుల రాశి : ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులు, ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయాన్ని వృథా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు పనులలో జాప్యం జరగవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.


వృశ్చిక రాశి : ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు.

ధనుస్సు రాశి : ఈ రోజు వస్తువులను కొనుగోలు చేయడం కొత్త తలనొప్పులను తీసుకొస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. . రాజకీయ, ప్రభుత్వ పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఇంటా బయట సానకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఆర్థికంగా బాగా కలసి వస్తుంది.

మకర రాశి : ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. వృత్తిలో నైపున్యం పరీక్షించబడుతుంది. ఖర్చులు అధికం అవుతాయి. ఈరోజు మీరు మీ ఆఫీసులో ఓ శుభవార్త అందుకునే అవకాశం ఉంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనులు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి.

కుంభ రాశి : గ్రహచలనం రిత్యా ఆరోగ్య సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో పెట్టు బడులు పెట్టిన వారు నష్టాలు చవి చూడక తప్పదు.కావున పెట్టబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు మీ ఆఫీసులో చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి : గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే.

ఇవి కూడా చదవండి : Hindenburg Report: అదానీ రచ్చ దేశానికి మచ్చ


Next Story

Most Viewed