నా ఛాతీ చిన్నగా అయిపోయింది.. నా భర్త నాతో సంతృప్తి చెందడం లేదు.. పెరగడానికి మార్గం చెప్పండి..

by Sujitha Rachapalli |   (  Updated:2026-02-26 15:51:36  IST  )

పాప పుట్టిన ఏడాదికి పాలు మాన్పించేందుకు ఓ ఇంజక్షన్ తీసుకుంది మహిళ. దీని కారణంగా బ్రెస్ట్ సైజ్ తగ్గడంతో భర్త దగ్గర అవమానాలు ఎదుర్కొంటోంది.

నా ఛాతీ చిన్నగా అయిపోయింది.. నా భర్త నాతో సంతృప్తి చెందడం లేదు.. పెరగడానికి మార్గం చెప్పండి..
X

ప్రశ్న : మేడం మా పాప పుట్టాక ఏడాదికి పాలు మాన్పించడానికి నాకేదో ఇంజక్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ఛాతీ చిన్నదిగా అయిపోయింది. నా భర్త అసంతృప్తి చెందుతున్నాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ బాధ ఎవరితోనూ చెప్పుకోలేను. నా ఛాతీ పెరగడానికి నాకేదైనా మార్గం చెప్పండి. - సంజన, వికారాబాద్

జవాబు : ఎవరితోనూ ఈ బాధ ఎందుకు చెప్పుకోలేరు? చెప్పుకోవాలి.. పంచుకోవాలి.. అప్పుడే మీ భర్త మీకు చేస్తున్న అన్యాయం అందరికీ తెలిసి.. ఏం చెయ్యాలో మీకు అర్థం అవుతుంది. ముందు మీ భర్త చేస్తున్న పనులు మీ పుట్టింటి వారికి, అత్త ఇంటి వారికి చెప్పేయండి. మీ భర్తకి వీ.డీ.ఆర్.ఎల్, హెచ్.ఎస్.వీ 1&2, హెచ్.ఐ.వీ పరీక్షలు చేయించండి. మీరు కూడా చేయించుకోండి. అన్నింటి కంటే ముఖ్యం అతనితో సెక్స్‌లో పాల్గొనడం వెంటనే మానేయండి. అతని ద్వారా మీకు సుఖరోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మీకు పాప పుట్టడానికి అతనూ బాధ్యుడు. అతను ఆ బిడ్డకి తండ్రి. మీ ఇద్దరికి కుటుంబం ఏర్పడటం కోసమే పిల్లలను కన్నారు. మీ ఒక్కరి కోసం మాత్రమే కాదు. అదొక సమిష్టి నిర్ణయంతో చేసింది. పాప పుట్టిన తరువాత మీకొచ్చిన శారీరిక సమస్యకు మీరొక్కరే బాధ్యులు కాదు అదొక నేరమూ కాదు. ఈ కారణంగా అతడును మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ బాధ్యత లేకుండా పరాయి స్త్రీలతో సెక్స్ సంబంధాలు పెట్టుకోడం నీచం, నేరం. మీ ప్రమేయమే లేకుండా మీకు వచ్చిన సమస్యను, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీకు అభద్రతని, అవమానాన్ని, అనారోగ్యాన్ని ఇస్తున్నాడు. అటువంటి అతన్ని మీరు ప్రశ్నించి, శిక్షించాల్సింది పోయి.. మీకు అంటించబోయే సుఖరోగాల గురించి భయపడాల్సింది పోయి.. మీ వక్షోజాల సైజు పెంచుకోడానికి మార్గాలు వెతుక్కోవడం ఆత్మ గౌరవం అనిపించుకోదు. ఆ విధంగా అతడు మీ పట్ల చేస్తున్న నేరాన్ని, దాని తీవ్రతను మీరే తగ్గించేస్తున్నారు. వెంటనే ఇద్దరూ పరీక్షలు చేయించుకోవాలి మీ పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పి మీ భర్త చెడు తిరుగుళ్లు ఆపించేయాలి. మీరు ఆహారంలో పాలు, నెయ్యి, వెన్న లాంటి మంచి పౌష్టికాహారం తీసుకుంటే, మళ్ళీ మీ ఛాతీ పూర్వ స్థితికి చేరుకుంటుంది.

డా. భారతి

సెక్సువల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్

ప్రీ అండ్ పోస్ట్ మ్యారేజ్ అండ్

సెక్సువల్ కౌన్సెలింగ్

8688519225

ప్రతీ పది నిమిషాలకు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా?

Next Story