- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ పది నిమిషాలకు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా?
నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగాక ప్రతి పది నిమిషాలకు యూరిన్ వెళ్తున్నారా? అలా అయితే ఓకే కానీ వాటర్ తాగకపోయినా ఇలా జరుగుతుందంటే డాక్టర్‌ను సంప్రదించాలనేది నిపుణుల సూచన

దిశ, ఫీచర్స్ : నీరు తాగిన వెంటనే ప్రతీ పది, పదిహేను నిమిషాలకు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? ఇది శరీరంలో ఏదైనా సమస్య ఉందని చెప్పేందుకు సంకేతం.. కాగా ఎప్పుడు నిజంగా ప్రాబ్లమ్ ఉందనే విషయం గురించి నిపుణులు సలహాలిస్తున్నారు. ఎక్కువ సేపు నీరు తాగకుండా ఉండటం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఒకేసారి నీరు ఎక్కువ మొత్తంలో తాగితే శరీరం అదనపు నీటిని త్వరగా బయటకు పంపిస్తుంది. ఇది సాధారణమే. కానీ తక్కువ మొత్తంలో నీరు తాగినా.. ఎప్పుడూ ఇలాగే జరిగితే మాత్రం ప్రాబ్లమ్ ఉన్నట్లే అని హెచ్చరిస్తున్నారు. మూత్రాశయం లేదా యూరినరీ సిస్టమ్ అసాధారణంగా ప్రతిస్పందిస్తుందని, సరిగ్గా లేదని చెప్తున్నారు.
కారణాలేమిటి?
* అతి చురుకైన మూత్రాశయం అంటే ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ కారణంగా ఇలా జరగొచ్చు. బ్లాడర్ కండరాలు తరచూ సంకోచించి, పూర్తిగా నిండకుండానే యూరిన్ వెళ్లేందుకు చాన్స్ ఉంది.
* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరో రీజన్.
* కెఫీన్ (టీ, కాఫీ), ఆల్కహాల్ వల్ల బ్లాడర్ చికాకు.
* రక్తంలో చక్కెర స్థాయి సరిగా నియంత్రణలో లేకపోవడం (డయాబెటిస్ సంబంధిత).
* ఆందోళన, స్ట్రెస్ వల్ల బ్లాడర్ సెన్సిటివిటీ పెరగడం.
* వయసు పెరిగేకొద్దీ బ్లాడర్ సామర్థ్యం, నియంత్రణ మారవచ్చు.
ఏం చేయాలి?
* ఎంత నీరు, ఎంత వేగంగా తాగుతున్నారో గమనించండి.
* ఒకేసారి ఎక్కువ తాగకుండా.. రోజంతా చిన్న చిన్న మొత్తాల్లో తాగండి.
* టీ, కాఫీ, శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటి బ్లాడర్ ఇర్రిటేటర్లను తగ్గించండి.
* నిర్దిష్ట సమయాల్లో మూత్ర విసర్జన ప్రాక్టీస్ చేయండి.
* పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ (కీగల్ వ్యాయామాలు) బ్లాడర్ నియంత్రణకు సహాయపడతాయి.
ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి?
* మంట, నొప్పి, రక్తం, దుర్వాసన, కడుపు దిగువ నొప్పి, జ్వరం, రాత్రి బాగా మేల్కొని మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి. ఇవి UTI, బ్లాడర్‌లో మంట, ప్రోస్టేట్ సమస్యలు, డయాబెటిస్ వంటివి సూచిస్తాయి.
* సాధారణంగా ఒకటి రెండుసార్లు ఇలా జరిగితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిరంతరం ఇబ్బందికరంగా ఉంటే నిర్లక్ష్యం చేయకండి. యూరాలజిస్ట్‌ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోండి.
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది.
Read Also : నా ఛాతీ చిన్నగా అయిపోయింది.. నా భర్త నాతో సంతృప్తి చెందడం లేదు.. పెరగడానికి మార్గం చెప్పండి..






