- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
URINE : బలవంతంగా మూత్రం ఆపుకుంటున్నారా? ప్రాణం పోతుంది జాగ్రత్త (పూర్తి వివరాలు)
చాలా మందికి మూత్రం ఆపుకునే అలవాటు ఉంటుంది. కొందరు బద్ధకంతో యూరిన్ వెళ్లకుండా ఉంటే.. ఇంకొందరు వెళ్లే పరిస్థితులు లేక ఆపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా

దిశ, ఫీచర్స్ : చాలా మందికి మూత్రం ఆపుకునే అలవాటు ఉంటుంది. కొందరు బద్ధకంతో యూరిన్ వెళ్లకుండా ఉంటే.. ఇంకొందరు వెళ్లే పరిస్థితులు లేక ఆపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ప్రయాణంలో యూరిన్ వెళ్లేందుకు మొహమాటపడుతూ.. ఇంటికి చేరుకున్నాకే మూత్రం చేస్తారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం కొనసాగితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి నష్టాలున్నాయి? నివారణా మార్గాలేంటి? తెలుసుకుందాం.
సమస్యలు
* సాధారణంగా మన శరీరం 400 నుంచి 600 మిలీ యూరిన్‌ను స్టోరేజ్ చేయగలదు. అంతకు మించి నిలుపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఇది చాలా కాలం కొనసాగితే అవి బిగుతుగా మారి.. గట్టిగా తుమ్మినా, దగ్గినా బట్టల్లోనే ఆటోమేటిక్‌గా యూరిన్ పడే పరిస్థితి తలెత్తుతుంది.
* మూత్రంలో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు పెరిగిపోయి ఇబ్బందులు పడక తప్పదు.
* ఇక ఈ బ్యాక్టీరియా ఎక్కువ సేపు బాడీలో ఉండటం వల్ల మూత్రనాళం ద్వారాన్ని నాశనం చేస్తుంది. తద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు వచ్చి చేరుతాయి.
నివారణలు
* ఈ ప్రమాదం ఇప్పటికే ఉన్నవారు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల పరిస్థితి అదుపులోకి రావచ్చు.
* ముఖ్యంగా మూత్రం ఆపుకునే అలవాటు మానేయండి. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ ఎప్పుడూ అదే చేయొద్దు.
* ఎక్సర్‌సైజ్, వర్క్ అవుట్ ద్వారా బాడీలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రయత్నం చేయండి.
* ఎక్కువ నీరు తాగుతూ బాడీని డీహైడ్రేటెడ్‌గా ఉంచండి. మూత్రం వచ్చిన ప్రతీసారి ఆపుకోకుండా వెళ్లండి.
Read More ...
తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. ఏఏ సమస్యలు తలెత్తుతాయంటే..?






