చిరంజీవి స్టామినా తగ్గిందా..? అందుకే ఆ సినిమాలా..?

by  |
చిరంజీవి స్టామినా తగ్గిందా..? అందుకే ఆ సినిమాలా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి స్టామినా తగ్గిందా..? గతంలోలాగా డాన్స్.. ఫైట్స్ .. చేయలేక పోతున్నారా..? అంటే అవుననే సమాధానం టాలీవుడ్ బీటౌన్ నుంచి వినిపిస్తోంది. అందుకు తాజాగా ఎంచుకుంటున్న పాత్రలేనని చెబుతున్నాయి ఆ వర్గాలు. ఇక నుంచి కమర్షియల్ సినిమాలు చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నాయి. కానీ ఆ వాదనలను చిత్రసీమలోని మరో వర్గం ఖండిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో ఆయన సినిమాలు బాక్సాఫిస్ వద్ద సృష్టించిన రికార్డులే చెబుతున్నాయంటున్నారు.

చిరంజీవి డాన్స్.. పర్ఫార్మెన్స్.. ఫైట్స్ .. ఇలా ఏదైనా ఆయన తర్వాతే ఎవరైనా అని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర హీరోలు చిరు స్టామినాను బహిరంగంగా పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయకుండా దాదాపు 10 ఏళ్లు గ్యాప్ ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో కనీసం ఓ 15 సినిమాలైనా చేసుండేవారు. ఆ 15 సినిమాలు చేసి ఉంటే ఈ రోజు మెగాస్టార్ ని ఊహించుకోవడం అసాధ్యం గా ఉండేది. అయినా ఆయన స్టామినాకి ఏమాత్రం ఢోకా లేదని రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తో ప్రూవ్ అయింది. మెగాస్టార్ డాన్స్ లో అదే గ్రేస్ .. పర్ఫార్మెన్స్ లో అదే పవర్.

మెగాస్టార్ అంటే భారీ కమర్షియల్ హీరో. ఆయన సినిమాలన్ని మాస్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మంచి ఎంటర్‌టైనర్స్ గా రూపొందుతుంటాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఏజ్ ని దృష్ఠిలో పెట్టుకుని ఆయనకి కమర్షియల్ సినిమాలు ఇకపై వర్కౌట్ కావేమో అన్న కామెంట్స్ చేస్తున్నారట. అందుకే వేదాళం లాంటి సినిమా కమిటయ్యాడని అంటున్నారు. అలాగే లూసీఫర్ కూడా కమిటయ్యాడని మాట్లాడుకుంటున్నారు. కాని ఈ రెండు సినిమాలని కమర్షియల్ సినిమాలుగానే తయారు చేయబోతున్నారని అంటున్నారు. మెగాస్టార్ స్టామినాకి ఇంకా కొన్ని భారీ కమర్షియల్ సినిమాలు చేయొచ్చని అభిమానులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కాని కొంతమంది మాత్రం ఇకనుంచి యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తే బావుంటుందని మాట్లాడుకుంటున్నారట.

కాగా రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ వరసగా సినిమాలు లైన్ లో పెట్టారు. ఇప్పటికే సైరా తో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆచార్య మల్టీస్టారర్ గా రూపొందుతున్నట్టే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చేసేందుకు చిరు సన్నాహాలు చేసుకున్నారు.



Next Story

Most Viewed