బిగ్ బ్రేకింగ్.. అంగన్​వాడీ టీచర్లకు గుడ్‌ న్యూస్​

by  |
Anganavadi
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అంగన్​వాడీ, మినీ అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 30 శాతం పీఆర్సీ పెంచిన నేపథ్యంలో ఈ వర్గానికి కూడా వేతన పెంపును వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్​వాడీ టీచర్లకు గతంలో రూ. 10,500 వేతనం ఉండగా.. దాన్ని రూ. 13,650కి పెంచారు. మినీ అంగన్​వాడీ టీచర్లకు రూ.6 వేలు ఉండగా.. రూ. 7,800 చొప్పున పెంచారు. అంగన్​వాడీ ఆయాలకు రూ. 6 వేలు వేతనం ఉండగా.. రూ. 7,800కు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వేతన పెంపు వర్తింపు జూలై నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

కాగా అంగన్​వాడీ సిబ్బందికి వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్స్​ అసోసియేషన్​ అధ్యక్షురాలు భిక్షమమ్మ, కార్యదర్శి సుమాంజలి, వైస్​ ప్రెసిడెంట్​ నిర్మల, తెలంగాణ అంగన్​వాడీ టీచర్స్, హెల్పర్స్ ​యూనియన్​ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, వి.నిర్మల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ జీవో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి

2021WCDW_MS47 (1)


Next Story

Most Viewed