ఉత్తరాఖండ్‌లో అడవిలో కార్చిచ్చు.. నలుగురు మృతి

by  |
ఉత్తరాఖండ్‌లో అడవిలో కార్చిచ్చు.. నలుగురు మృతి
X

సిమ్లా : వేసవి రాకముందే హిమాలయ సానువుల్లోని ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు ప్రబలుతున్నది. ప్రతియేటా ఇక్కడి అడవుల్లో మంటలు సర్వసాధారణమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,240 హెక్టార్‌ల అడవి కాలి బూడిదైంది. 950 సార్లు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనల్లో నలుగురు పౌరులు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలున్నారు.

అల్మోరా జిల్లాలోని ఈ ఇద్దరు మహిళలు పశువులకు దాణా కోసం వెళ్లి మంటల్లో చిక్కుకుని ఆహుతయ్యారు. గడిచిన 24 గంటల్లోనే 62 హెక్టార్ల మేరకు ఈ మంటలు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12వేల గార్డులు, ఫైర్ వాచర్స్‌ను అటవీ ప్రాంతాల్లో మోహరించామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(ఫైర్) వివరించారు.

ఇప్పటి వరకు రూ. 37 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి హెలికాప్టర్ల సహాయం తీసుకోబోతున్నట్టు సీఎం తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు.

Next Story

Most Viewed