Trending: జగన్ ఓటమిపై విచారణ జరిపించాలి.. లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా

by Shiva |
Trending: జగన్ ఓటమిపై విచారణ జరిపించాలి.. లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ అక్కడక్కడ నిరసన జ్వాలలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులు జగన్మోహన్ ‌రెడ్డి ఓటమిని తట్టుకోవడం లేదు. వాళ్లంతా రకరకాలుగా నిరనస వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు పరిధిలో ఓ ఘటన చోటుచేసుకుంది. బ్రాహ్మణ‌గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జగన్ ఓటమిపై వెంటనే విచారణ చేపట్టాలని లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి‌పై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదరించాడు. తమను కాపాడేందుకు పోలీసులు, అధికారులు వస్తే దూకేస్తానని బెదిరించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read More : రేయ్ చెత్తనా కొడకా అంటూ పవన్ కళ్యాణ్‌పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

Next Story

Most Viewed