రేయ్ చెత్తనా కొడకా అంటూ పవన్ కళ్యాణ్‌పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

by Kavitha |
రేయ్ చెత్తనా కొడకా అంటూ పవన్ కళ్యాణ్‌పై  రెచ్చిపోయిన శ్రీరెడ్డి
X

దిశ, సినిమా: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా తిరుగుతానని శపథం చేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అధికారిక వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తగా కాకపోయినా ఎప్పటినుంచో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే అని చెప్తూ వచ్చింది. జగన్‌కు, పార్టీకి సంబంధించిన అన్ని విషయాలపై పట్టు ఉన్నట్లు లైవ్ వీడియోల్లో తెగ మాట్లాడేది.

అయితే తాజాగా మాట్లాడిన మాటలు నెట్టింట హాట్ టాపిక్ అయింది. అందులో భాగంగా నేను జగన్‌కు, పార్టీకి మద్దతూ చేస్తూ ఎన్నో విషయాలను మాట్లాడిన అదే విధంగా పార్టీ కోసం చాలా కష్ట పడ్డాను. అలాంటి తనను జగన్ ఒక్కసారి కూడా విజయవాడకు పిలిపించి మాకు మద్దతు ఇస్తున్నందుకు థాంక్స్ అని చెప్పిన పాపాన పోలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ పిలిచి మాట్లాడినా మాట్లాడకపోయినా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని.. ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా కార్యకర్తగానే వెళ్తానని తెలిపింది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కొడాలి నాని, పేర్ని నానిల ఇళ్లపై తెలుగు దేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని.. మరి ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ ఇప్పుడెందుకు బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టిన చెత్తనా కొడుకు అని.. ఈరోజు బయటికి వచ్చి అదే అమాయక ప్రజలపై దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడని నోరుపారేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Next Story

Most Viewed