మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఇండియా కూటమి నేతలు ఫైర్

by Shamantha N |
మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఇండియా కూటమి నేతలు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రివర్గ శాఖల కేటాయింపుపై ఇండియా కూటమి నేతలు విరుచుకుపడ్డారు. ఎన్డీఏ భాగస్వామ్యులకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలతో పాటు ముఖ్యశాఖలన్నీ బీజేపీ ఎంపీలకే కేటాయించారని గుర్తుచేశారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కు మంత్రివర్గంలో చోటివ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం గుర్తు చేశారు. బీజేపీ బ్రాండ్ వాషింగ్ మెషీన్ ప్రత్యేక లక్షణం స్లో, ఫాస్ట్, సూపర్ ఫాస్ అని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. బీజేపీ వివిద మోడ్ లను ప్రఫుల్ పటేల్ తెలుసుకోవాలని అన్నారు. మరోవైపు, రవ్ నీత్ బిట్టుకు లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రిపదవి దక్కిందని.. ఆయన సూపర్ ఫాస్ట్ మోడ్ లో ఉన్నట్లు స్పష్టం అయ్యిందన్నారు. ఏకనాథ్ షిండే శివసేనకు కేవలం ఒక ఎంఓఎస్ బెర్త్ దక్కిందని.. తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, హెచ్డీ కుమారస్వామి కేబినేట్ బెర్తులు పొందారని అన్నారు.

బిహార్ ఎంపీలకు నామమాత్రపు శాఖలు- తేజస్వి యాదవ్

ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ ఝుంఝునా ( ఆట బొమ్మలు) అందజేసిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ధ్వజమెత్తారు. బిహార్‌ ఎంపీలకు కేవలం నామమాత్రపు శాఖలు మాత్రమే కేటాయించారని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బిహార్ పెద్ద పాత్ర పోషించిందన్నారు. అయితే, శాఖలను కేటాయించడం ప్రధానమంత్రికి ఉన్న ప్రత్యేకాధికారం అని అన్నారు. కానీ అన్ని విభాగాల్లో పని జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు.

లోక్ సభ స్పీకర్ పదవి కూడా బీజేపీకే- ఒమర్ అబ్దుల్లా

బీజేపీ తన మిత్రపక్షాలకు మిగిలిపోయిన శాఖలను కేటాయించిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చురకలు అంటించారు. ముఖ్యమైన శాఖలన్నీబీజేపీ తమ పార్టీకి కేటాయించుకుందన్నారు. లోక్ సభ స్పీకర్ పదవి కూడా బీజేపీ ఎంపీకే దక్కుతుందని అన్నారు. ఈ మేరక్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.



Next Story

Most Viewed