మందుబాబులకు అలెర్ట్!.. ఇకనుంచి ఆ బ్రాండ్లు లేనట్లే..

by Kavitha |
మందుబాబులకు అలెర్ట్!.. ఇకనుంచి ఆ బ్రాండ్లు లేనట్లే..
X

దిశ, ఫీచర్స్: రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం. మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికత పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనుకకు తగ్గినట్టు తెలిస్తోంది. ఇటీవల కొత్త బీర్‌ బ్రాండ్‌లపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొత్తకొత్త మీమ్స్‌తో తమ నిరసనను వ్యక్తంచేశారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మొత్తంగా కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలిసింది.

Next Story

Most Viewed