Trending: బెంగళూరులో అమానవీయ ఘటన.. కారును ఓవర్ టేక్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి

by Shiva |
Trending: బెంగళూరులో అమానవీయ ఘటన.. కారును ఓవర్ టేక్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: కారును ఓవర్ టేక్ చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్‌పై ఓ వక్తి దాడికి పాల్పడిన అమానవీ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారిపై ఉన్న నేలమంగల టోల్ ప్లాజా వద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న 5 నెలల బాలుడిని ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లో వాణి విలాస్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్సు టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో అది నచ్చని ఇన్నోవా కారులో వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5 కి.మీ మేర ఛేజ్ చేసి డ్రైవర్‌ను కాలర్ పట్టుకుని అంబులెన్స్ నుంచి బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 5 నెలల బాలుడి తల్లిదండ్రులు ప్లీజ్.. వదిలేయండి అని బ్రతిమిలాడినా వారు వినలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి చెత్త మనుషులు కూడా ఉంటారా అని కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed