మీ పిల్లలు ఫస్ట్ డే స్కూల్‌కు వెళ్తున్నారా.. పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!

by Jakkula Samataha |
మీ పిల్లలు ఫస్ట్ డే స్కూల్‌కు వెళ్తున్నారా.. పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : పిల్లలకు కాస్త కష్టం అనిపించే వార్త ఏదైనా ఉన్నదా అంటే అది స్కూల్ స్టార్ట్ అవ్వడమే. వేసవి సెలవుల్లో ఆనందంగా, ఎంజాయ్ చేసిన వారు మళ్లీ స్కూల్ అంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి అయిపోయాయి. చూసిచూడగానే జూన్ 12 వచ్చేసింది. ఇక ఈ రోజు బడిలోకి పిల్లలు మొదటిసారిగా వెళ్లాల్సిందే. అయితే తమ పిల్లలను మొదటి రోజు పాఠశాలలకు పంపించే సమయంలో వారితో కలిసి తల్లిదండ్రులు కూడా వెళ్లాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ? వారు వెళ్లడం ద్వారా పాఠశాలలో తమ పిల్లాడి చదువు, ఈ సంవత్సరం తనపై వారు తీసుకునే కేరింగ్, గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటినీ తెలుసుకొని, ఈ సంవత్సరం వాటిని సరిదిద్దడానికి ఉపయోగపడుతుందంట. అయితే ఇప్పటికే చాలా పాఠశాలల్లో క్లాసెస్ స్టార్ట్ చేయడానికి అధ్యాపకులు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు, టీచర్స్‌ను కలవడం చాలా ముఖ్యం అంట. వారు అధ్యాపకులను కలిసి.. తమ పిల్లవాడి గురించి ఎంక్వైర్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మొదటగా మీరు టీచర్‌తో మీ పిల్లాడి ఆరోగ్యం గురించి మాట్లాడాలి.. క్లాస్‌లో ఎలా ఉంటాడు, ఇబ్బందిగా ఫీలైనట్లు, ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఉన్నట్లు కనిపిస్తుంటాడా అనేది తెలుసుకోవాలి.

  • క్లాస్ వాతావరణం, తోటి విద్యార్థులతో తమ పిల్లవాడి ప్రవర్తన గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. తమ పిల్లవాడు ఇతరులతో కలిసి మాట్లాడటం, వారితో సరదాగా ఉండటం చేస్తున్నాడా లేక మూడీగా ఒక్కడే ఉంటున్నాడా? యాక్టివ్‌గా ఉంటాడా? డల్‌గా ఉంటాడా తెలుసుకోవాలి.

  • టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడో లేదో? అలాగే ఆయన క్లాసెస్ అటెండ్ అవ్వడం, పాఠశాలలోని ప్రతి క్లాస్ ఇంట్రెస్ట్‌గా వింటున్నాడా లేదా అనేది తెలుసుకోవాలి. హోమ్ వర్క్ చేస్తారా లేదా అనేది కూడా అడిగి తెలుసుకోవాలి.

  • గత సంవత్సరంలో తమ పిల్లవాడు చేసి మిస్టేక్స్ ఏంటో క్లుప్తంగా అడగాలి, హోమ్ వర్క్ చేయడంలో ఆయన చూపించిన నిర్లక్ష్యం, పాఠశాలలోని తమ పిల్లవాడి ర్యాంకు, ఎందులో యాక్టివ్‌గా ఉన్నాడు, పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాలుపంచుకుంటున్నాడో లేదా? అనే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి.

ఇవి ముఖ్యం :

లాస్ట్ ఇయర్ తమ పిల్లలు తరగతి గదిలోని విజయాలు, సవాళ్ల గురించి అడిగి తెలుసుకోవాలి.

తమ బిడ్డ భవిష్యత్తు కోసం పాఠశాలలో ఎలాంటి నియమాలు పెట్టారు, వారు ఈ సంవత్సరం కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెడుతున్నారో అడిగి తెలుసుకోవాలి.

గత సంవత్సరంలో తమ పిల్లలు చేసిన తప్పులు ఈ సంవత్సరంలో రిపీట్ కాకుండా ఉండాలంటే ఏంచేయాలి.

పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.

తరగతి గదిలో బోధనా పద్ధతులు సరిపోతున్నాయా లేదా తెలుసుకోవాలి

ఇంట్లో పిల్లల అభ్యాసానికి ఎలా సపోర్ట్ చేయాలి? వారిని ఏ విధంగా హోమ్ వర్క్ చేయించాలి? లాంటి వాటి గురించి టీచర్స్‌తో మాట్లాడి సూచనలు తీసుకోవాలి.

ఉపాధ్యాయులతో ఓపెన్ కమ్యూనికేషన్ చేయాలి. గతంలో తమ పిల్లలు చేసిన తప్పులను శ్రద్ధగా విని వాటిని ఈ సంవత్సరంలో రిపీట్ కాకుండా చూసుకోవాలి.

మీ పిల్లల్లో ఆలోచనాశక్తిని పెంచడానికి మీరు ఇంటి వద్ద ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. దీని ద్వారా మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేసిన వారు అవుతారు అంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed