ఛీ వీడు మనిషేనా.. నాలుగేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో దృశ్యం నటుడు అరెస్ట్?

by Samataha |
ఛీ వీడు మనిషేనా.. నాలుగేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో  దృశ్యం నటుడు అరెస్ట్?
X

దిశ, సినిమా : రోజు రోజుకు అత్యాచార కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అభం, శుభం తెలియని పసి మనుసలపైన మాయని మచ్చ వేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కొదరైతే ఆడవారి జీవితాలను ఆదిలోనే సమసిపోయేలా చేస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులు వాటిని పట్టించుకోవడం లేదు. ఈ కోవలోకే చేరారు ఓ నటుడు. ఏకంగా అభం,శుభం తెలియని ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెల్లితే.. దృశ్యం నటుడు, విలన్ పాత్రల్లో నటించిన మళయాల యాక్టర్ కూటికల్ జయచంద్రన్ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిపారని, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మళయాల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన తమ చిన్నారి, చాలా సేపటి తర్వాత ఇంటికి వచ్చిందని, తాను చాలా బలహీనంగా, నీరసంగా ఉండటమే కాకుండా, చిరిగిపోయిన దుస్తులు, శరీరం దుమ్ముతో ఉండటాన్ని బంధువుల గమనించారు. తర్వాత ఎక్వైరీ చేయగా పాపపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. దీంతో వారు కోజికోడ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాధు చేయడంతో, పోలీసులు నటుడిపై ఫోక్సో కేసు నమోదు చేసుకొన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు వారి చిన్నారి నుంచి వాగ్మూల తీసుకొని, కేసు నమోదు చేసి, నటుడిని అరెస్ట్ చేశారంటూ మలయాళం మీడియా కోడైకూస్తుంది. అయితే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం నటుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ ఓ నటడు, ఇలాంటి దారుణమైన పనికి ఒడిగట్టడంతో ఆయన్ను కఠినంగా శిక్షించాలంటూ వారు కోరుతున్నారు. చీ వీడు మనిషేనా.. ప్రభుత్వం ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed