నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో.. రూ.లక్ష పెడితే 4 కోట్ల లాభం..!

by  |
నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో.. రూ.లక్ష పెడితే 4 కోట్ల లాభం..!
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఫ్యామిలీ ప్రాబ్రమ్స్, ఆర్థిక ఇబ్బందులు వలన కొత్తగా ఏదైనా చేయాలంటే వెనకడుకు వేయచ్చు. కొందరికీ బిజినెస్ ప్లాన్స్ ఉన్నా పెట్టుబడి లేకపోవడం, ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం కూడా వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ఇలాంటి వ్యక్తులు కష్టపడకుండా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మిగిలిన ఏకైక మార్గం స్టాక్ మార్కెట్స్. ఇందులో రిటర్న్స్ ఎలా ఉంటాయో రిస్క్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టేముందుకు మార్కెట్ అనలిస్టుల సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా బెటర్..

రోడ్డు మీద కనకవర్షం.. ఎగబడ్డ జనాలు!

వారం కిందట జరిగిన పరిణామాలను గమనిస్తే ‘నైకా’ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రెండు రోజులు రికార్డ్ రేంజ్‌లో లాభాల్లో దూసుకెళ్లాయి. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, కత్రినా కైఫ్ షేర్లు 80 శాతం లాభాలను సాధించాయి. రూ. 4 కోట్లు పెట్టిన ఆలియా ఏకంగా 50 కోట్లు సంపాదించగా, కత్రినా రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టి 20కోట్లకు పైగా సంపాదించింది. ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిన జాబితాలో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు నిలిచారు. ఇక రెండ్రోజుల కింద Paytm IPOకు వెళ్లగా కనీసం లిస్టింగ్ ధర కూడా రాలేదు. షేరు ప్రారంభ ధర రూ.1500 ఉండగా మైనస్ 1200 వద్ద ట్రేడ్ అయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. షేర్ మార్కెట్స్ కూడా లక్ ఉన్నవారికి లేదా మార్కెట్ మీద మంచి పట్టు ఉన్న వారికి మాత్రమే మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టముంటే లాభాలొస్తాయి లేదా కోలుకోలేని విధంగా నష్టాలొస్తాయి. కానీ కొన్ని కంపెనీల షేర్లు మాత్రం అధికంగా ర్యాలీ చేస్తూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అటువంటి వాటిలో ‘ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్’ షేరు కూడా ఒకటి. ఇది తాజాగా ఇన్వెస్టర్ల పంట పండించింది. భారీ లాభాలను సంపాదించి పెట్టింది. గత రెండేళ్ల కాలంలోనే ఈ షేరు ధర భారీగా పెరిగింది. 2019 మార్చిలో దీని ధర కేవలం 35 పైసలు ఉండగా, ప్రస్తుతం రూ.143. అనగా ఒక్క షేర్ వాల్యూ ఏకంగా 400 రెట్లకు పైగా పెరిగింది.

అనగా రెండేళ్ల కిందట మీరు ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.4 కోట్లు. గత ఆరు నెలల్లోనే రూ.7.6 నుంచి రూ.143కు చేరుకుంది. అనగా 1780 శాతం ర్యాలీ చేసింది.ఈ సంవత్సరంలో షేరు వాల్యూ రూ.1.95 నుంచి రూ.143కు ఎగబాకింది.

సెక్స్ గాడ్‌తో సెక్సీ క్వీన్స్.. జలస్ ఫీల్ అవుతున్నారా?

epaper – 4:00 PM TS EDITION (20-11-21) చదవండి


Next Story

Most Viewed