తీవ్ర విషాదం: ఐదు మృతదేహాల మధ్య మూడేళ్ల చిన్నారి.. ఐదురోజుల నుంచి ఆకలితో

by  |
తీవ్ర విషాదం: ఐదు మృతదేహాల మధ్య మూడేళ్ల చిన్నారి.. ఐదురోజుల నుంచి ఆకలితో
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఐదురోజుల నుంచి ఇద్దరు చిన్నారులు ఆ మృతదేహాల వద్దే ఏడుస్తూ కూర్చొన్నారు. అందులో ఒక చిన్నారి ఆకలితో మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన బెంగళూరు నగరం బైడరహల్లి ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. బెంగళూరు తిగళరపాళ్య చేతన్‌ ప్రాంతంలో శంకర్‌(54), భారతి(51) దంపతులు నివసిస్తున్నారు. అతనికి ఇద్దరు కూతుళ్లు సించన(33), సింధురాణి(30).. ఒక కొడుకు మధుసాగర్(26) ఉన్నారు. శంకర్‌ జర్నలిస్టు గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇక నాలుగేళ్ల క్రితం సించనకు వివాహం జరిగింది. ఆమెకు ఒక పాప(3) ఉండగా రెండో కాన్పు కోసం గతేడాది పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదినెలల బాబు ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పుట్టింటికి వచ్చిన కూతురిని అత్తింటికి వెళ్ళమని తండ్రి శంకర్ సూచించాడు. అయితే సించన మాత్రం తండ్రి మాట వినిపించుకోలేదు. దీంతో కోపం వచ్చిన శంకర్ తన మాటను ఇంట్లో ఎవరు వినడంలేదని ఎవరికి చెప్పకుండా వారం రోజుల క్రితం ఇంటినుంచి వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తండ్రి కోసం వెతికినా ప్రయోజనం లేదు. శుక్రవారం రాత్రి కోపం తగ్గాకా శంకర్ ఇంటికి వచ్చాడు. తలుపు మూసిఉండడంతో కిటికి తెరిచి చూసేసరికి షాకింగ్ ఘటన ఎదురయ్యింది.

తొమ్మిది నెలల చిన్నారితో సహా కుటుంబం మొత్తం శవాలుగా కనిపించారు. మూడేళ్ళ చిన్నారి మాత్రం అపస్మారక స్థితిలో కనిపించింది. ఈ వివాదాల నడుమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. తమ తమ గదుల్లో ఒకేసారి నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నారని, పాలు లేక పసికందు ఏడ్చి ఏడ్చి చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ ఐదు రోజులుగా పాప మృతదేహాల చుట్టూనే తిరిగి ఉంటుందని, ఆకలికి తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

షాకింగ్ వీడియో.. నా కూతురినే ప్రేమిస్తావా.. నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడుతో..

కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు.. చిన్నారి ముందే సిగ్గులేకుండా.. వీడియో వైరల్


Next Story

Most Viewed